ICMR: ఏడాదిపాటు టీకా రోగనిరోధక శక్తి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఏడాది వరకు ఉంటాయని తేలిందని, అందువల్ల ఇప్పుడే బూస్టర్‌ డోసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. ...

Published : 01 Oct 2021 08:35 IST

బూస్టర్‌ డోసు అప్పుడే వద్దు: ఐసీఎంఆర్‌

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఏడాది వరకు ఉంటాయని తేలిందని, అందువల్ల ఇప్పుడే బూస్టర్‌ డోసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. వయోజనులందరికీ 100% టీకా ఇవ్వడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో నిర్వహించిన అధ్యయనంలో 95%కి పైగా యాంటీబాడీలు ఏడాది వరకు ఉన్నట్లు తేలిందన్నారు. డెంగీ వ్యాక్సిన్‌ గురించి తాము సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌లోని కొన్ని సంస్థలు దేశం వెలుపల కరోనా టీకా మొదటి దశ పరీక్షలు పూర్తిచేశాయని, మరిన్ని పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జైడస్‌ క్యాడిలా సంస్థ టీకా జైకోవ్‌-డిని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోకి తీసుకురానున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. దేశంలో అన్ని వ్యాక్సిన్లకూ అత్యవసర వినియోగానికే అనుమతి ఇచ్చినందున అవి నేరుగా మార్కెట్‌లోకి రావన్నారు. జైకోవ్‌-డి టీకా ధరపై తయారీదారుతో చర్చలు జరుగుతున్నాయన్నారు. అది మూడు డోసుల వ్యాక్సిన్‌ అని, దానికి సూది అవసరం లేదు కాబట్టి దాని ధర వేరుగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని