బడులు తెరవడానికి.. అందాకా ఆగొద్దు!

కొవిడ్‌తో తెరుచుకోని పాఠశాలల పునఃప్రారంభానికి.. విస్తృతస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకు ఆగాల్సిన అవసరం లేదని ప్రపంచ బ్యాంకు సూచించింది.

Published : 04 Oct 2021 04:53 IST

ప్రపంచ బ్యాంకు

దిల్లీ: కొవిడ్‌తో తెరుచుకోని పాఠశాలల పునఃప్రారంభానికి.. విస్తృతస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకు ఆగాల్సిన అవసరం లేదని ప్రపంచ బ్యాంకు సూచించింది. లభిస్తున్న ఆధారాలను బట్టి పిల్లలకు కొవిడ్‌ సోకే అవకాశాలు తక్కువేనని, అలాగే వారిలో వ్యాధి తీవ్రం కావడం, మరణాల ముప్పు స్వల్పమేనని పేర్కొంది. సురక్షిత విధానాలతో స్కూళ్లు తెరవొచ్చని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే బడుల్లో విద్యార్థులు, సిబ్బంది ఇతరుల మధ్య వైరస్‌వ్యాప్తి ముప్పు తక్కువే ఉంటుందని ప్రపంచ బ్యాంకు విద్యా బృందం (ఎడ్యుకేషన్‌ టీమ్‌) తన ‘న్యూ పాలసీ నోట్‌’లో అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని