జపాన్‌ ప్రధాని పీఠం కిషిదదే

అందరూ ఊహించినట్లుగానే జపాన్‌ ప్రధానమంత్రి పీఠం ఫుమియో కిషిదకు దక్కింది. పార్లమెంటులో తాజాగా జరిగిన ఎన్నికలో ఆయన నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. 64 ఏళ్ల కిషిద గతంలో జపాన్‌ విదేశాంగ

Updated : 05 Oct 2021 11:16 IST

శుభాకాంక్షలు తెలిపిన మోదీ

టోక్యో: అందరూ ఊహించినట్లుగానే జపాన్‌ ప్రధానమంత్రి పీఠం ఫుమియో కిషిదకు దక్కింది. పార్లమెంటులో తాజాగా జరిగిన ఎన్నికలో ఆయన నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. 64 ఏళ్ల కిషిద గతంలో జపాన్‌ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. గతవారం లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే.. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ఆ పార్టీకి, దాని మిత్రపక్షానికి పార్లమెంటు ఉభయ సభల్లో స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో.. ప్రధానమంత్రి పదవికి సోమవారం జరిగిన ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాన్‌స్టిట్యూషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ జపాన్‌ అధినేత యెకియో ఎడానోపై కిషిద సునాయాసంగా విజయం సాధించారు. ఆ వెంటనే ఆయన కొత్త కేబినెట్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ ప్రధానిగా ఉన్న యోషిహిదె సుగా మంత్రివర్గంలో 20 మంది సభ్యులు ఉండగా.. వారిలో కేవలం ఇద్దరినే కిషిద మళ్లీ మంత్రులుగా తీసుకున్నారు. పార్లమెంటు దిగువ సభను రద్దు చేసి.. ఈ నెల 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కిషిద తాజాగా ప్రకటించారు. జపాన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన ఫుమియో కిషిదకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని