Published : 07/10/2021 05:22 IST

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

గరిష్ఠంగా వచ్చేది రూ.17,951

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైల్వే నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్‌ను ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకొంది. నెలకు రూ.7,000 వేతనం ప్రాతిపదికనే బోనస్‌ను లెక్కించే విధానం వల్ల ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన మొత్తం కాకుండా గరిష్ఠంగా రూ.17,951 మాత్రమే వస్తుంది. బోనస్‌ వల్ల 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కలిపి రూ.1,985 కోట్లు అందుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. 2010-11 నుంచి 2019-20 వరకు 78 రోజుల బోనస్‌ ఇచ్చినట్లు రైల్వేశాఖ గుర్తుచేసింది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈసారి బోనస్‌ 82 రోజులకు ఇస్తారనుకుంటే 6వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 78 రోజులకే పరిమితం చేయడం పట్ల రైల్వే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దసరా లోపే ఉద్యోగుల ఖాతాలకు బోనస్‌ మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని