Covishield: కొవిషీల్డ్‌ తీసుకుంటే క్వారంటైన్‌ నుంచి మినహాయింపు

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు వేసుకొని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది.

Updated : 08 Oct 2021 06:57 IST

భారతీయులకు ఊరటనిచ్చిన బ్రిటన్‌

దిల్లీ: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు వేసుకొని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ గురువారం వెల్లడించారు. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ తమ దేశానికి వచ్చే భారతీయులు 10రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్‌ ఇటీవల నిబంధన జారీ చేసింది. దీంతో భారత్‌ కూడా ఇక్కడికొచ్చే బ్రిటన్‌ పౌరులకూ క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ఆ దేశం దిగొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని