తొందరగా బలగాలను ఉపసంహరించండి

సరిహద్దుల్లో దెప్సాంగ్‌ సహా ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు ఆదివారం జరిగిన 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో భారత్‌ స్పష్టం చేసింది. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో

Updated : 11 Oct 2021 11:20 IST

 చైనాకు స్పష్టం చేసిన భారత్‌

ముగిసిన 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు

దిల్లీ: సరిహద్దుల్లో దెప్సాంగ్‌ సహా ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు ఆదివారం జరిగిన 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో భారత్‌ స్పష్టం చేసింది. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు రాత్రి ఏడు గంటల వరకు సాగాయి. భేటీలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 15 (హాట్‌స్ప్రింగ్‌ ప్రాంతం)పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే చర్చలపై భారత సైన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల్లో భారత బృందానికి లెహ్‌లోని 14 కోర్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ నాయకత్వం వహించారు. గత ఏడాది నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో భారత్‌- చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని సడలించడానికి ఇప్పటికే ఇరు దేశాల మధ్య 12 రౌండ్ల కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. ఫలితంగా ఫిబ్రవరిలో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి, ఆగస్టులో గోగ్రా ప్రాంతం నుంచి ఇరుదేశాలు తమ బలగాలను ఉపసంహరించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని