చైనా ఒత్తిళ్లకు తలొగ్గం: తైవాన్‌

తమ గగనతలంలోకి చైనా తరచూ యుద్ధ విమానాలను పంపిస్తూ కవ్వింపులకు తెగబడుతున్న నేపథ్యంలో తైవాన్‌ అధ్యక్షురాలు సై ఇంగ్‌-వెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రాగన్‌ సైన్యం నుంచి పొంచి ఉన్న ముప్పును దీటుగా ఎదుర్కొంటామన్నారు. పునరేకీకరణ కోసం ఆ దేశం తీసుకొస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గబోమని స్పష్టం చేశారు. నేషనల్‌ డే వేడుకలను పురస్కరించుకొని సై ఆదివారం

Updated : 11 Oct 2021 11:16 IST

తైపీ: తమ గగనతలంలోకి చైనా తరచూ యుద్ధ విమానాలను పంపిస్తూ కవ్వింపులకు తెగబడుతున్న నేపథ్యంలో తైవాన్‌ అధ్యక్షురాలు సై ఇంగ్‌-వెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రాగన్‌ సైన్యం నుంచి పొంచి ఉన్న ముప్పును దీటుగా ఎదుర్కొంటామన్నారు. పునరేకీకరణ కోసం ఆ దేశం తీసుకొస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గబోమని స్పష్టం చేశారు. నేషనల్‌ డే వేడుకలను పురస్కరించుకొని సై ఆదివారం ప్రసంగించారు. తమ సైనిక సామర్థ్యాలను మరింత పెంచుకోనున్నట్లు చెప్పారు. చైనా తమ ముందుంచిన ఆఫర్లు.. తైవాన్‌ ప్రజల సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. తమ సైనిక సామర్థ్యాలను చాటిచెప్పేలా తాజా వేడుకల్లో తైవాన్‌ రక్షణ శాఖ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని