రష్యాలో మృత్యుకల్లోలం!

రష్యాలో కొవిడ్‌ మహమ్మారి మృత్యుకల్లోలం రేపుతోంది. రోజురోజుకీ మరణాలు, కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి తర్వాత ఎన్నడూ లేనంతగా మంగళవారం 1,015 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 33,740 కొత్త కేసులు

Updated : 20 Oct 2021 06:07 IST

ఒక్క రోజులో 1,015 కొవిడ్‌ మరణాలు

మాస్కో: రష్యాలో కొవిడ్‌ మహమ్మారి మృత్యుకల్లోలం రేపుతోంది. రోజురోజుకీ మరణాలు, కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి తర్వాత ఎన్నడూ లేనంతగా మంగళవారం 1,015 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 33,740 కొత్త కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఇంతవరకు మొత్తం 80.60 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 2,25,325 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఈనెల 30 నుంచి వారం రోజుల పాటు సెలవు ప్రకటించాలని ఉప ప్రధాని తత్యానా గోలికోవా సూచించారు. ఈమేరకు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను మంత్రివర్గం కోరనున్నట్లు తెలిపారు. కాగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడానికి రష్యా ఇంతవరకు సుముఖంగా లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని