ఒక్కోసారి ఎక్కువ సమయం పడుతుంది

ఒక వ్యాక్సిన్‌ను సమగ్రంగా మూల్యాంకనం చేసి, వినియోగానికి సిఫారసు చేయడానికి ఒక్కోసారి ఎక్కువ సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైక్‌ రియాన్‌ తెలిపారు. కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర అనుమతి అక్టోబర్‌ 26కల్లా వస్తుందా..

Published : 23 Oct 2021 05:18 IST

కొవాగ్జిన్‌కు అనుమతులపై డబ్ల్యూహెచ్‌వో స్పందన

ఐక్యరాజ్యసమితి/జెనీవా: ఒక వ్యాక్సిన్‌ను సమగ్రంగా మూల్యాంకనం చేసి, వినియోగానికి సిఫారసు చేయడానికి ఒక్కోసారి ఎక్కువ సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైక్‌ రియాన్‌ తెలిపారు. కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర అనుమతి అక్టోబర్‌ 26కల్లా వస్తుందా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘డబ్ల్యూహెచ్‌వో సలహా ప్రక్రియ ద్వారా అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్‌) ఇచ్చిన టీకాలను అన్ని దేశాలు గుర్తించాలని మేం కోరుకుంటాం. అందుకే ఈ విషయంలో చాలా కచ్చితంగా వ్యవహరిస్తాం. వ్యాక్సిన్‌పైనే కాకుండా.. తయారీ ప్రక్రియ సమాచారాన్ని సేకరిస్తాం. ఎందుకంటే టీకా సురక్షితమని, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కూడినదని ప్రపంచానికి మేం సిఫారసు చేస్తాం’’ అని రియాన్‌ చెప్పారు. 26న కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్‌)పై డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక సలహా బృందం సమావేశం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని