టీకా వేసుకుంటే.. ఎల్‌ఎఫ్‌టీ చాలు

టీకా రెండు డోసులూ తీసుకొని ఇతర దేశాల నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లే ప్రయాణికులు ఇకపై తక్కువ ఖర్చులో పూర్తయ్యే ‘లాటెరల్‌ ఫ్లో టెస్ట్‌ (ఎల్‌ఎఫ్‌టీ)’ విధానంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే...

Published : 25 Oct 2021 04:54 IST

విదేశీ ప్రయాణికులకు ఇంగ్లాండ్‌ వెసులుబాటు

లండన్‌: టీకా రెండు డోసులూ తీసుకొని ఇతర దేశాల నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లే ప్రయాణికులు ఇకపై తక్కువ ఖర్చులో పూర్తయ్యే ‘లాటెరల్‌ ఫ్లో టెస్ట్‌ (ఎల్‌ఎఫ్‌టీ)’ విధానంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. పర్యటక రంగానికి మరింత ఊపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ మేరకు నిబంధనలను కాస్త సడలించినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ‘పాలీమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌)’ విధానంలోనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఇప్పటివరకు నిబంధన ఉండేది. ఎల్‌ఎఫ్‌టీతో పోలిస్తే పీసీఆర్‌ కాస్త ఖరీదైన వ్యవహారం. బ్రిటన్‌లో భాగంగా ఉన్న వేల్స్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌ కూడా ఇకపై విదేశీ ప్రయాణికులకు ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష వెసులుబాటును కల్పించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని