Passport: జపాన్‌ పాస్‌పోర్టు ఉంటే 192 దేశాలకు వెళ్లొచ్చు

పాస్‌పోర్టు సూచీలో జపాన్‌, సింగపూర్‌ ప్రథమ స్థానంలో నిలిచాయి. దక్షిణ కొరియా, జర్మనీ ద్వితీయ స్థానం పొందాయి. ‘హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌’లో భారత పాస్‌పోర్టు స్కోరు

Updated : 25 Oct 2021 09:58 IST

సింగపూర్‌దీ అదే ఘనత
సూచీలో తొలిస్థానం ఆ రెండు దేశాలదే
ఆరు స్థానాలు పడిపోయిన భారత్‌

లండన్‌: పాస్‌పోర్టు సూచీలో జపాన్‌, సింగపూర్‌ ప్రథమ స్థానంలో నిలిచాయి. దక్షిణ కొరియా, జర్మనీ ద్వితీయ స్థానం పొందాయి. ‘హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌’లో భారత పాస్‌పోర్టు స్కోరు గత ఏడాది (84) కంటే ఆరు స్థానాలు తగ్గిపోయి 90కి పరిమితమైంది. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్టులు ఇచ్చే దేశాలను ఈ సూచీలో పేర్కొంటారు. దాదాపు రెండేళ్లుగా అమల్లో ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల్ని వివిధ దేశాలు సడలిస్తున్న తరుణంలో ఈ నివేదిక వెలువడింది. ముందస్తు వీసా అవసరం లేకుండా ఒక దేశ పౌరులు ఎన్ని గమ్యస్థానాలకు వెళ్లవచ్చనే సంఖ్య ఆధారంగా ర్యాంకులు రూపొందిస్తారు. సింగపూర్‌, జపాన్‌ ప్రజలు 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. భారత్‌ ప్రజలు 58 దేశాలకు ఇలా వెళ్లవచ్చు. తాజా ర్యాంకుల్లో భారత్‌ సరసన తజికిస్థాన్‌, బుర్కినా ఫాసో నిలిచాయి. వరసగా మూడో ఏడాది కూడా జపాన్‌ తొలిస్థానంలో నిలిచింది. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, సిరియా, పాకిస్థాన్‌, యెమెన్‌ దేశాలు అట్టడుగున ఉన్నాయి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని