‘కొవాగ్జిన్‌’పై మరింత సమాచారం అవసరం

కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను భారత్‌ బయోటెక్‌ నుంచి ‘అదనపు సమాచారం’ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ...

Updated : 27 Oct 2021 13:25 IST

డబ్ల్యూహెచ్‌ఓ బృందం నిర్ణయం
అనుమతిపై 3న భేటీ

ఐరాస/జెనీవా: కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను భారత్‌ బయోటెక్‌ నుంచి ‘అదనపు సమాచారం’ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ‘‘ఈ వారాంతంలో భారత్‌ బయోటెక్‌ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం భావిస్తోంది. ఈ మేరకు తుది మదింపునకు గాను నవంబరు 3 (బుధవారం)న తిరిగి సమావేశమవుతుంది’’ అని పీటీఐ అడిగిన ఓ ప్రశ్నకు డబ్ల్యూహెచ్‌ఓ మంగళవారం సమాధానం ఇచ్చింది. అయితే అంతకుముందు డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి డాక్టర్‌ మార్గరెట్‌ హారిస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతిపై ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ టీకా అత్యవసర వినియోగ అనుమతికి సిఫార్సు చేసే విషయమై మంగళవారం డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని