
Published : 31 Oct 2021 06:07 IST
పాటల బృందంపై తాలిబన్ల కాల్పులు
13 మంది మృతి
కాబుల్: వివాహ వేడుకలో పాటలు పాడుతున్నవారిపై తాలిబన్లు కాల్పులు జరపడంతో 13 మంది మరణించారని అఫ్గానిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ శనివారం ట్వీట్ చేశారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఇది చోటు చేసుకుందని తెలిపారు. సంగీత కార్యక్రమాలంటే తాలిబన్లకు ఇష్టం ఉండదు. పాడుతున్నవారి నోళ్లు మూయించడానికే కాల్పులు జరిపారని అమ్రుల్లా ఆరోపించారు.
Tags :