Yogi Adityanath: ఆజంగఢ్‌.. ఆర్యంగఢ్‌గా మారుతుంది

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌.. త్వరలోనే ఆర్యంగఢ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ అన్నారు. శనివారం ఇక్కడ నూతన యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో యోగీ మాట్లాడుతూ.

Published : 14 Nov 2021 09:35 IST

యోగీ ఆదిత్యనాథ్‌

ఆజంగఢ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌.. త్వరలోనే ఆర్యంగఢ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ అన్నారు. శనివారం ఇక్కడ నూతన యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో యోగీ మాట్లాడుతూ.. యూనివర్సిటీ రాకతో ఆంజగఢ్‌ నగరానికి ఆర్యంగఢ్‌గా అసలైన పేరు వస్తుందన్నారు. ‘‘ఆజంగఢ్‌.. ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఇవ్వడంతో పాటు వారిని పార్లమెంట్‌కు కూడా పంపిఉండొచ్చు. కానీ వారి కారణంగానే ఈ నగరానికి చెడ్డ పేరు వచ్చింది’’ అని అఖిలేశ్‌ యాదవ్‌, అతని తండ్రి ములాయంసింగ్‌లపై యోగీ విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం, రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం రాకమునుపు ఆజంగఢ్‌ యువకులకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో హోటల్‌ గది కూడా ఇచ్చేవారు కాదని, అలాంటి పరిస్థితిని తాము సమూలంగా మారుస్తున్నట్టు చెప్పారు. ఇక్కడినుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి (అఖిలేశ్‌) కేవలం ఎన్నికల సమయంలోనే స్థానికులకు కనిపిస్తుంటారని ఎద్దేవా చేశారు. 2007లో ఇదే ప్రాంతంలో తనపై జరిగిన దాడిని కూడా యోగీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని