ఈడీ చర్యలు నిలిపివేయండి

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన వ్యాపారవేత్త మెహుల్‌ చోక్సీ... తనకు వ్యతిరేకంగా ఈడీ చేపట్టిన చర్యలను నిలిపివేయాలని కోరుతూ న్యాయవాది ద్వారా గురువారం

Published : 20 Nov 2021 05:43 IST

బాంబే హైకోర్టులో చోక్సీ పిటిషన్‌

ముంబయి: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన వ్యాపారవేత్త మెహుల్‌ చోక్సీ... తనకు వ్యతిరేకంగా ఈడీ చేపట్టిన చర్యలను నిలిపివేయాలని కోరుతూ న్యాయవాది ద్వారా గురువారం బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ ఈడీ 2019లో నగదు అక్రమ రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి కేసులు నమోదు కాకముందే విదేశాలకు వెళ్లినందున పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించరాదని చోక్సీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆరోగ్య కారణాల వల్లే భారత్‌కు రాలేకపోతున్నానని తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే తిరస్కరిస్తున్నానంటూ భారత అధికారులు తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చోక్సీ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. సవివరమైన సమాధానాన్ని దాఖలు చేసేందుకు ఈడీకి సమయమిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 21వ తేదీకి జస్టిస్‌ ఎస్‌.కె.షిందే ధర్మాసనం వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని