షీ జిన్‌పింగ్‌కు భయపడే?

కరోనా వైరస్‌ వచ్చినప్పటి నుంచి చైనాకు ఆగ్రహం రాకుండా, ఆ దేశానికి అపఖ్యాతి కలగకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. మానవాళిని అల్లకల్లోలం

Updated : 28 Nov 2021 04:49 IST

‘ఒమిక్రాన్‌’ పేరుపెట్టడంలో 2 అక్షరాల్ని డబ్ల్యూహెచ్‌వో దాటేసింది!

లండన్‌: కరోనా వైరస్‌ వచ్చినప్పటి నుంచి చైనాకు ఆగ్రహం రాకుండా, ఆ దేశానికి అపఖ్యాతి కలగకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. మానవాళిని అల్లకల్లోలం చేసిన కొవిడ్‌ విషయంలో మిగతా ప్రపంచానికి చైనా ఆలస్యంగా సమాచారమిచ్చినప్పటికీ ఎక్కడా ఆ దేశాన్ని డబ్ల్యూహెచ్‌వో నిందించలేదని అమెరికా సహా పలు దేశాలు విమర్శించాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో కనిపించిన సార్స్‌-కొవ్‌-2 వేరియంట్‌ బి.1.1.529కు ‘ఒమిక్రాన్‌’ అని నామకరణం చేయడంలోనూ ఆ చైనా పక్షపాతమే కీలక పాత్ర పోషించిందన్న అంశం వివాదాస్పదమవుతోంది

పేరెలా పెట్టారంటే..

కొవిడ్‌ కొత్త వేరియంట్లకు గ్రీకు వర్ణమాలలోని అక్షరాలతో డబ్ల్యూహెచ్‌వో పేర్లు పెడుతుంది. అంటే తెలుగులో అ, ఆ, ఇ, ఈ మాదిరిగా.. గ్రీకు భాషలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అన్నమాట. ఆ రకంగా చూస్తే.. బి.1.1.529కు ‘వ్యి’(న్యూ) అనే అక్షరంతో పేరు పెట్టాలి. ‘న్యూ’తో పెడితే వరుస క్రమంలో తర్వాత వచ్చే అక్షరం ‘శ్రీi’ (షీ). చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేరులోనూ ‘షీ’ ఉండటంతో డబ్ల్యూహెచ్‌వో కమిటీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బి.1.1.529కు ‘న్యూ’తో పేరు పెడితే తర్వాత వచ్చే వేరియంట్‌ని ‘షీ’ అని పిలవాలి. అప్పుడు చైనా నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించటానికి డబ్ల్యూహెచ్‌వో.. న్యూ, షీలను దాటవేసి తర్వాత అక్షరమైన ఒమిక్రాన్‌ పేరును వైరస్‌కు పెట్టిందని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ మార్టిన్‌ కల్డార్ఫ్‌ అభిప్రాయపడ్డారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని