Updated : 30 Nov 2021 05:39 IST

శశిథరూర్‌ ‘ఆకర్షణీయ’ వివాదం!

స్వీయ చిత్రానికి జోడించిన వ్యాఖ్యపై విమర్శలు

దిల్లీ: మహిళా ఎంపీలతో కలిసి తీసుకున్న స్వీయచిత్రానికి సంబంధించి కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌ జోడించిన వ్యాఖ్యపై ట్విటర్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పార్లమెంటు సమావేశాలు సోమవారం మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహిళా ఎంపీలు సుప్రియా సూలే, ప్రణీత్‌ కౌర్‌, తమిజాచి తంగపండియన్‌, మిమి చక్రవర్తి, నస్రత్‌ జహాన్‌, జ్యోతిమణిలతో శశిథరూర్‌ స్వీయచిత్రం తీసుకున్నారు. అనంతరం దానిని ట్విటర్‌లో ఉంచుతూ.. ‘‘విధినిర్వహణకు లోక్‌సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరు చెప్పారు?’’ అన్న వ్యాఖ్యను జోడించారు. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు ‘సెక్సిజమ్‌’తో కూడిన వ్యాఖ్య అని మండిపడ్డారు. ‘‘వారిని ఆకర్షణీయమైన వస్తువుగా మార్చుతూ.. పార్లమెంటులో, రాజకీయాల్లో వారి కృషిని కించపరిచారు. పార్లమెంటులో మహిళలను కించపరచవద్దు’’ అంటూ జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ ట్వీట్‌ చేశారు. అనంతరం విమర్శలపై స్పందించిన శశిథరూర్‌ మరో ట్వీట్‌ చేశారు. ఈ ఫొటో వల్ల బాధపడిన వారికి క్షమాపణలు చెబుతున్నట్లు అందులో వెల్లడించారు. స్వీయచిత్రం తీసుకోవాలన్న ఆలోచన మహిళా ఎంపీలదేనని, వారే చిత్రాన్ని ట్విటర్‌లో ఉంచమని కోరారని స్పష్టంచేశారు. అదే సమయంలో పని ప్రదేశంలో ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని