US: అమెరికా వెళ్లాలంటే కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి

ప్రయాణానికి ముందు రోజు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న తరవాతనే అమెరికా వెళ్లే విమానాన్ని ఎక్కాల్సి ఉంటుంది. టీకా వేయించుకున్నవారికీ, వేయించుకోని వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

Updated : 02 Dec 2021 10:29 IST

వాషింగ్టన్‌: ప్రయాణానికి ముందు రోజు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న తరవాతనే అమెరికా వెళ్లే విమానాన్ని ఎక్కాల్సి ఉంటుంది. టీకా వేయించుకున్నవారికీ, వేయించుకోని వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ‘ఒమిక్రాన్‌’ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో బైడెన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం అమెరికాకు బయలుదేరడానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుంటే సరిపోతుందన్న నిబంధన ఉండగా, దాన్ని ఒక రోజుకు పరిమితం చేయనున్నట్టు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని