Tiktok: టిక్‌టాక్‌లో చిట్కాలతో నెలకు రూ.కోటి

మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌, గూగుల్‌ షీట్స్‌ గురించి చిట్కాలు, మెలకువలు చెబుతూ అమెరికా యువతి ఒకరు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ మేరకు న్యూయార్క్‌కు చెందిన కేట్‌ నోర్టన్‌ అనే 27 ఏళ్ల యువతి టిక్‌ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆన్‌లైన్‌ క్లాస్‌లు బోధిస్తూ నెలకు రూ.కోటికిపైనే సంపాదిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో

Updated : 03 Dec 2021 08:14 IST

 అమెరికా యువతి కేట్‌ నోర్టన్‌ ఆర్జన

మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌, గూగుల్‌ షీట్స్‌ గురించి చిట్కాలు, మెలకువలు చెబుతూ అమెరికా యువతి ఒకరు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ మేరకు న్యూయార్క్‌కు చెందిన కేట్‌ నోర్టన్‌ అనే 27 ఏళ్ల యువతి టిక్‌ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆన్‌లైన్‌ క్లాస్‌లు బోధిస్తూ నెలకు రూ.కోటికిపైనే సంపాదిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాస్త బోరింగ్‌గా అనిపించే ఎక్సెల్‌, గూగుల్‌ స్ప్రెడ్‌ షీట్స్‌పై పాఠాలు చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం కేట్‌ వదులుకున్నారు. మొదట మిస్‌ ఎక్సెల్‌ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌ టాక్‌లో ఆమె ఖాతా ప్రారంభించారు. గతేడాది నవంబరులో ఆన్‌లైన్‌ టీచింగ్‌ బిజినెస్‌ మొదలుపెట్టారు. సరదాగా నృత్యం చేస్తూ మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌ గురించి ఆసక్తికరంగా పాఠాలు చెప్పేవారు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ తరగతులకు హాజరయ్యే వారి సంఖ్య కొద్దిరోజుల్లోనే బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో 2021 ఏప్రిల్‌ నాటికి నెలకు రూ.కోటి ఆదాయం అందుకున్నారు. కేట్‌ ప్రియుడు సైతం ఉద్యోగాన్ని వదిలి ఆమెకు సాయం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఎక్సెల్‌, గూగుల్‌ షీట్స్‌పై పూర్తిస్థాయి శిక్షకురాలిగా మాత్రమే కాకుండా.. ఇతర ఆన్‌లైన్‌ ప్రొడక్ట్స్‌, కోర్స్‌లను బోధిస్తూ కేట్‌ చేతినిండా సంపాదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు