
Updated : 07 Dec 2021 08:45 IST
600 మంది పిల్లల్ని ఇళ్లకు చేర్చిన ‘బజరంగీ భాయిజాన్’
‘బజరంగీ భాయిజాన్’లో సల్మాన్ ఖాన్ తప్పిపోయిన ఓ మూగ బాలికను ఎంతో శ్రమకోర్చి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. హరియాణాకు చెందిన ఏఎస్‌ఐ రాజేశ్ కుమార్ దాదాపు 600 మంది పిల్లల్ని తిరిగి తమ ఇళ్లకు చేర్చి నిజజీవిత బజరంగీ భాయిజాన్‌గా మారారు. మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో పనిచేసే రాజేశ్ 2016 నుంచి 600 మందికిపైగా పిల్లలు, మహిళలు, వృద్ధులను.. తిరిగి తమ కుటుంబాలతో కలిపారు. ఓసారి బాలల గృహానికి వెళ్లగా.. అక్కడ పిల్లలు తమను తల్లిదండ్రులతో కలపాలని అడిగారని చెప్పారు రాజేశ్. అప్పుడే అలాంటివారి బాధలు తీర్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తప్పిపోయినవారితోపాటు కిడ్నాప్ అయిన పిల్లలను కూడా రక్షించినట్లు చెప్పారు. మానసిక స్థితి సరిగా లేని వారు, మాట్లాడలేని వారిని తమ ఇళ్లకు చేర్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు.
Tags :