Madhulika Rawat: సేవా కార్యక్రమాల్లో మధులిక ముందంజ

హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సతీమణి మధులికా రావత్‌.. ఆపన్నుల పాలిట అమృతమూర్తిగా పేరు పొందారు. భారత సైన్యంలో సేవా కార్యక్రమాలకు ఆమె ప్రతిరూపంగా నిలిచారు....

Published : 09 Dec 2021 07:36 IST

దిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సతీమణి మధులికా రావత్‌.. ఆపన్నుల పాలిట అమృతమూర్తిగా పేరు పొందారు. భారత సైన్యంలో సేవా కార్యక్రమాలకు ఆమె ప్రతిరూపంగా నిలిచారు. సైనికుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. సైనిక కుటుంబాల బాగోగులు చూడటం దీని ప్రధాన విధి. పోరాటాల్లో భర్తలను కోల్పోయిన మహిళలకు మధులిక ఓదార్పునిచ్చేవారు. దివ్యాంగులైన పిల్లల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. సైనికుల కుటుంబ సభ్యుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆమె కృషి చేశారు. వారికోసం కుట్లు, అల్లికలు, సంచుల తయారీ, బ్యుటీషియన్‌ కోర్సులు నిర్వహించారు. ఆరోగ్యంపైనా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సాధారణ ప్రజల కోసం కూడా ఆమె అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా క్యాన్సర్‌ బాధితుల శ్రేయస్సు కోసం కృషి చేశారు. మధులిక విద్యాభ్యాసం గ్వాలియర్‌లోని సింధియా కన్యా విద్యాలయలో సాగింది. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు