MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్రాసు హైకోర్టు ప్రశంసలు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేయడాన్ని ఆపాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ..నిందితుడు సాట్టై మురుగన్‌ను హెచ్చరించింది. మదురైకు చెందిన సాట్టై మురుగన్‌ గతంలో స్టాలిన్‌పై పలు ఆరోపణలు

Updated : 10 Dec 2021 07:41 IST

చెన్నై(గిండి), న్యూస్‌టుడే: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేయడాన్ని ఆపాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ..నిందితుడు సాట్టై మురుగన్‌ను హెచ్చరించింది. మదురైకు చెందిన సాట్టై మురుగన్‌ గతంలో స్టాలిన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జామీను కోరుతూ సాట్టై మురుగన్‌ మదురై ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు గురువారం న్యాయమూర్తి పుగళేంది ముందుకు విచారణకు వచ్చింది. స్టాలిన్‌ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి అన్నారు. అభినందించకపోయినా ఫర్వాలేదుగానీ ఆయన్ను విమర్శించడాన్ని కోర్టు సహించదన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఏ తప్పులు చేస్తే గుర్తించారు? అని న్యాయమూర్తి సాట్టై మురుగన్‌ను ప్రశ్నించారు. కోర్టుకు ఇచ్చిన హామీని అధిగమించి ఇకపై ఒక్కమాట మాట్లాడినా జామీను రద్దు చేస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని