ప్రజలు ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు?

ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తింటారని, దానిని నియంత్రించే అధికారం మీకెవరిచ్చారంటూ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఏఎంసీ)పై గుజరాత్‌ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Published : 11 Dec 2021 06:56 IST

మాంసాహార వివాదంపై గుజరాత్‌ హైకోర్టు ఆగ్రహం

అహ్మదాబాద్‌: ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తింటారని, దానిని నియంత్రించే అధికారం మీకెవరిచ్చారంటూ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఏఎంసీ)పై గుజరాత్‌ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని తేల్చిచెప్పింది. మాంసాహార విక్రయదారులే లక్ష్యంగా ఏఎంసీ చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ వీధి వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విధంగా స్పందించింది. మాంసాహార విక్రయదారులనే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వాదనలో నిజం లేదని ఏఎంసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని