Updated : 12 Dec 2021 07:33 IST

Varun Singh: నా కుమారుడు తిరిగి వస్తాడు: కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ తండ్రి ఆశాభావం

 

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ‘నా కుమారుడు ఓ పోరాటయోధుడు. మృత్యువును జయించి వస్తాడు’ అని తీవ్ర గాయాలతో బెంగళూరు కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ తండ్రి విశ్రాంత కర్నల్‌ కేపీ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన శనివారం తన కుమారుడి ఆరోగ్య వివరాలను బెంగళూరులో విలేకరులకు వివరించారు. కుమారుడి ఆరోగ్యం క్షణానికో రీతిగా మారుతోందన్నారు. గంట గంటకూ వరుణ్‌ సింగ్‌ ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నిపుణులైన వైద్య బృందంతో చక్కగానే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు.. ప్రస్తుతం బెంగళూరు కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్‌కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా స్థిరంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని