ISRO: అంతరిక్షంలో చికెన్‌ బిర్యానీ, సాంబారు అన్నం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేెపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొనే   వ్యోమగాములకు అవసరమయ్యే ఆహార పదార్థాల తయారీ ప్రారంభమైంది.

Published : 15 Dec 2021 07:27 IST

గగన్‌యాన్‌ కోసం భోజనం సిద్ధం చేస్తున్న డీఎఫ్‌ఆర్‌ఎల్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేెపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొనే వ్యోమగాములకు అవసరమయ్యే ఆహార పదార్థాల తయారీ ప్రారంభమైంది. కర్ణాటకలోని మైసూర్‌లో డీఆర్‌డీవోకు చెందిన డీఎఫ్‌ఆర్‌ఎల్‌ (డిఫెన్స్‌ ఫుడ్‌ రీసెర్చ్‌ లెబోరేటరీ) ఈ ఆహారాన్ని తయారు చేస్తోంది. డీఎఫ్‌ఆర్‌ఎల్‌ శాస్త్రవేత్త మధుకర్‌ ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘భూమ్మీద అయితే కూర్చుని లేదా నిలబడి మనం భోజనం చేసేందుకు వీలు ఉంటుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అక్కడ మన చపాతీలు, కూరలు అన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. అందువల్ల వ్యోమగాముల కోసం ప్రత్యేక ఆహార పదార్థాల జాబితాను సిద్ధంచేసి.. వాటిని పరీక్షిస్తున్నాం. గగన్‌యాన్‌లో భాగంగా రోదసిలోకి వెళుతున్న ముగ్గురు వ్యోమగాములు భారతీయులే. అందువల్ల భారతీయ వంటకాలనే ఎంపిక చేశాం. రెడీ టు ఈట్‌ వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.

ఆహార పదార్థాలు ఇవే..

రెడీ టు ఈట్‌
వెజ్‌ పులావ్‌, వెజ్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, చికెన్‌ కుర్మా, దాల్‌ మఖానీ, షాహీ పనీర్‌, సూజి హల్వా, చికెన్‌ కట్టి రోల్‌, వెజ్‌ కట్టి రోల్‌, ఎగ్‌ కట్టి రోల్‌, స్టఫ్డ్‌ పరోటా

రెడీ టు డ్రింక్‌
మ్యాంగో నెక్టర్‌, పైనాపిల్‌ జ్యూస్‌, టీ, కాఫీ

కాంబో ఫుడ్‌
రాజ్మా చావల్‌, సాంబార్‌ చావల్‌, దాల్‌ చావల్‌, రెడీ టు ఈట్‌ ఎనర్జీ బార్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని