Updated : 15 Dec 2021 08:55 IST

Sleep: నిద్ర తెచ్చిన తంటా

విమానం సరకుల గదిలో ఉండిపోయి అబుదాబి చేరిన ఉద్యోగి

దిల్లీ: ఇండిగో విమానంలో సరకులు నింపే ఉద్యోగి ఒకరు ముంబయి-అబుదాబి వెళ్లే విమానం సరకుల గదిలో పొరపాటున నిద్రపోయారు. ఆ సంగతిని ఎవరూ గమనించక పోవడంతో విమానం అబుదాబి వెళ్లిపోయింది. ఆదివారం రాత్రి ముంబయి నుంచి అబుదాబి వెళ్లే విమానంలో సరకులు నింపే ఉద్యోగి ఒకరు ఓ సంచి దగ్గర నిద్రపోయారు. ఈ విషయాన్ని గమనించని మిగతా సిబ్బంది తలుపు వేసేశారు. విమానం గాల్లోకి లేచిన తర్వాత అతనికి మెలకువ వచ్చింది. విమానం అబుదాబిలో దిగాక సరకుల గదిలో ఉన్న వ్యక్తిని గుర్తించిన అక్కడి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆ పరీక్షల్లో తేలింది. అనంతరం అక్కడి అధికారుల నుంచి అనుమతులు పొందిన తర్వాత ఆ వ్యక్తిని భారత్‌ తీసుకొచ్చినట్లు డీజీసీఏ తెలిపింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని