CBSE: 12వ తరగతి విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు అసత్యం..

పన్నెండో తరగతి అకౌంటన్సీ టర్మ్‌-1 ప్రశ్నపత్రంలో చోటుచేసుకున్న పొరపాటు కారణంగా విద్యార్థులకు 6 గ్రేస్‌ మార్కులు..

Published : 15 Dec 2021 13:28 IST

నకిలీ వార్తలపై హెచ్చరించిన సీబీఎస్‌ఈ

దిల్లీ: పన్నెండో తరగతి అకౌంటన్సీ టర్మ్‌-1 ప్రశ్నపత్రంలో చోటుచేసుకున్న పొరపాటు కారణంగా విద్యార్థులకు 6 గ్రేస్‌ మార్కులు ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలు అసత్యమని సీబీఎస్‌ఈ వెల్లడించింది. సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణాధికారి పేరిట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆడియో సందేశం నకిలీదని స్పష్టం చేసింది. 28 నుంచి 31 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారికి 38 మార్కులు ఇవ్వనున్నట్లు ఆ సందేశంలో వినిపిస్తోంది. అది నిజం కాదని సీబీఎస్‌ఈ పేర్కొంది. విద్యార్థులు అలాంటివాటిని నమ్మవద్దని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని