Crime News: ప్రేమ మత్తులో దొంగలైన వైద్య విద్యార్థులు

రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య విద్యార్థులు దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇద్దరు యువకులు ముఠాగా ఏర్పడి పుణెలోని హడాప్సర్‌, కొత్‌రుడ్‌ ప్రాంతంలోని నగల దుకాణాల్లో దొంగతనం చేశారు. ఒకయువకుడు

Published : 16 Dec 2021 07:21 IST

 

ముంబయి: రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య విద్యార్థులు దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇద్దరు యువకులు ముఠాగా ఏర్పడి పుణెలోని హడాప్సర్‌, కొత్‌రుడ్‌ ప్రాంతంలోని నగల దుకాణాల్లో దొంగతనం చేశారు. ఒకయువకుడు నగలు కొనేందుకు వచ్చినట్లుగా నటించి వ్యాపారిని ఏమార్చి బంగారం ఉంగరాలతో బయటకు వచ్చాడు. అదే సమయంలో దుకాణం బయట మరో యువకుడు ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు. ఈ ఘటనపై నగల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఆధారాలతో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.5 లక్షల విలువైన ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు లాతూర్‌కు చెందిన అంకిత్‌ హనుమంత్‌ రొకాడే(23), మరొకరు వాశిం జిల్లాకు చెందిన వైభవ్‌ సంజయ్‌ జగ్‌తాప్‌(22)గా పోలీసులు గుర్తించారు. వైద్య విద్య అభ్యసిస్తున్న వీరు జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డారని తెలిపారు. తమ ప్రియురాళ్లకు కానుకగా ఇవ్వడానికి ఉంగరాలను దొంగతనం చేశామని నిందితులు అంగీకరించారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని