Vaccine: నోటి ద్వారా కొవిడ్‌ టీకా

నోటి ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సిద్ధమవుతోంది. అమెరికా/ ఇజ్రాయెల్‌కు చెందిన ఔషధ కంపెనీ ఒరామెడ్‌కు అనుబంధ సంస్థ ఒరావ్యాక్స్‌ రూపొందించిన ఈ మందుపై దక్షిణాఫ్రికాలో మొదటి విడత క్లినికల్‌ ప్రయోగాలు మొదలయ్యాయి.

Updated : 17 Dec 2021 06:57 IST

దక్షిణాఫ్రికాలో క్లినికల్‌ ప్రయోగాలు ఆరంభం

జొహెన్నెస్‌బర్గ్‌: నోటి ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సిద్ధమవుతోంది. అమెరికా/ ఇజ్రాయెల్‌కు చెందిన ఔషధ కంపెనీ ఒరామెడ్‌కు అనుబంధ సంస్థ ఒరావ్యాక్స్‌ రూపొందించిన ఈ మందుపై దక్షిణాఫ్రికాలో మొదటి విడత క్లినికల్‌ ప్రయోగాలు మొదలయ్యాయి.

వ్యాక్సినేషన్ల ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడానికి దక్షిణాఫ్రికా తీవ్రస్థాయిలో శ్రమిస్తోంది. ఈ దేశంలో అనేక మంది టీకాల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్లకు తావులేని టీకా వల్ల వ్యాక్సినేషన్‌ సులువవుతుందని ఒరామెడ్‌ సీఈవో నాడవ్‌ కిడ్రోన్‌ తెలిపారు. ఇది వైరస్‌-లైక్‌ పార్టికిల్స్‌ (వీఎల్‌పీ) టీకా అని పేర్కొన్నారు. గతంలో కొవిడ్‌ టీకా పొందనివారు, ఆ వ్యాధి బారినపడనివారిని తాజా క్లినికల్‌ ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. రెండు డోసుల్లో దీన్ని ఇస్తామని, రెండింటి మధ్య మూడు వారాల విరామం ఉంటుందన్నారు. కరోనా వైరస్‌లోని మూడు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఉత్పరివర్తనకు పెద్దగా లోనుకాని ఒక ప్రొటీన్‌ కూడా ఇందులో ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు