Prison: చేయని నేరానికి 19 ఏళ్లు జైల్లో..

చేయని నేరానికి హబిల్‌ సింధు అనే వ్యక్తి 19 ఏళ్లు జైలులో మగ్గిన దీనగాథ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 2003లో జాసీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బలరాంపుర్‌లో మూడు హత్యలు జరిగాయి.

Updated : 17 Dec 2021 07:25 IST

హబిల్‌ సింధు

కటక్‌, న్యూస్‌టుడే: చేయని నేరానికి హబిల్‌ సింధు అనే వ్యక్తి 19 ఏళ్లు జైలులో మగ్గిన దీనగాథ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 2003లో జాసీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బలరాంపుర్‌లో మూడు హత్యలు జరిగాయి. హబిల్‌ సింధు క్షుద్ర పూజలు చేసి ఈ హత్యలకు పాల్పడ్డాడని గ్రామస్థులంతా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 2005లో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న హబిల్‌ హైకోర్టును ఆశ్రయించారు. మరోసారి కేసును విచారించాలని జిల్లా సెషన్స్‌ న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో 11 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించి, మరికొందరిని విచారించిన సెషన్స్‌కోర్టు... హబిల్‌ సింధును నిర్దోషిగా ప్రకటించింది. 19 ఏళ్ల తర్వాత బుధవారం కారాగారం నుంచి విడుదలైన హబిల్‌ తన జీవితంలో ఎంతో విలువైన కాలం వృథా అయిందని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని