China: చైనాలో 135 ఏళ్లు బతికిన బామ్మ కన్నుమూత

చైనాలో అతిపెద్ద వయస్కురాలైన అలీమిహాన్‌ సెయితీ కన్నుమూశారు. షిన్‌ జియాంగ్‌ ప్రాంతంలో 135 ఏళ్ల వయసులో ఆమె మరణించినట్లు స్థానిక అధికారులు  శనివారం వెల్లడించారు. మరణించే రోజు వరకు ఎలాంటి అనారోగ్య

Updated : 19 Dec 2021 07:23 IST

బీజింగ్‌: చైనాలో అతిపెద్ద వయస్కురాలైన అలీమిహాన్‌ సెయితీ కన్నుమూశారు. షిన్‌ జియాంగ్‌ ప్రాంతంలో 135 ఏళ్ల వయసులో ఆమె మరణించినట్లు స్థానిక అధికారులు  శనివారం వెల్లడించారు. మరణించే రోజు వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సరళమైన జీవితాన్ని గడిపారని తెలిపారు. చైనాలో ‘దీర్ఘాయువుల పట్టణం’గా పేరొందిన కొముజెరిక్‌లో 1886, జూన్‌ 25న సెయితీ జన్మించారు. ఈ పట్టణంలో 90 ఏళ్లు దాటిన వృద్ధులు ఎటుచూసినా కనిపిస్తారు. స్థానిక ప్రభుత్వం ఏటా ఉచిత వైద్య పరీక్షలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు రాయితీలు అమలు చేస్తోంది. ఎప్పుడూ వేళకు తింటూ.. ఇంటి పెరట్లోని ఎండలో నడుస్తూ సెయితీ ఉల్లాసంగా ఉండేవారని స్థానిక మీడియా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని