Madhya Pradesh: మరుగుదొడ్లు కడిగిన మధ్యప్రదేశ్‌ మంత్రి

మధ్యప్రదేశ్‌ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్‌ తోమర్‌ పాఠశాలలో మరుగొడ్లను (టాయిలెట్లు) శుభ్రం చేశారు. స్వచ్ఛత-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా 30 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన గతంలో

Updated : 19 Dec 2021 10:25 IST

బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రద్యుమ్న సింగ్‌ తోమర్‌

మధ్యప్రదేశ్‌ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్‌ తోమర్‌ పాఠశాలలో మరుగొడ్లను (టాయిలెట్లు) శుభ్రం చేశారు. స్వచ్ఛత-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా 30 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన గతంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్వాలియర్‌, హజీరాలోని ఓ పాఠశాలను సందర్శించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై అక్కడి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో వసతులపై వివరాలు అడిగారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని మరుగుదొడ్లు ఉపయోగించుకోలేని రీతిలో ఉన్నాయని, దుర్గంధంతో అటువైపునకు వెళ్లలేకపోతున్నామని మంత్రికి తెలిపింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన  ప్రద్యుమ్న సింగ్‌ వాటిని శుభ్రం చేశారు. పనులు చేయించే అధికారంతో పాటు అవసరమైతే వాటిని స్వయంగా చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉంటుందని ప్రజా ప్రతినిధులకు సందేశం అందించేందుకే ఇలా చేశానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని