వింత ఆచారం.. ముళ్ల కంపపై దొర్లుతూ సోదరికి వీడ్కోలు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ వింత ఆచారాలు ఉన్నాయి. అలాంటివి పాటించడం ఏమాత్రం మంచిది కాదని తెలిసినా.. వాటిని మానడానికి మాత్రం ప్రజలు అంగీకరించరు.

Updated : 20 Dec 2021 10:43 IST

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ వింత ఆచారాలు ఉన్నాయి. అలాంటివి పాటించడం ఏమాత్రం మంచిది కాదని తెలిసినా.. వాటిని మానడానికి మాత్రం ప్రజలు అంగీకరించరు. ఇలాంటి మూఢ విశ్వాసాలకు మరో ఉదాహరణ మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఇక్కడ ఓ గ్రామానికి చెందిన కొంతమంది.. ముళ్లకంపపై పడుకుని దొర్లుతున్నారు. సెహరా గ్రామంలోని రజ్జడ్‌ తెగ ప్రజలు తాము పాండవుల వారసులమని చెబుతుంటారు. పురాణాల్లో పాండవులు తమ సత్యనిష్ఠను నిరూపించుకునేందుకు ముళ్ల కంపపై దొర్లారని.. అదే తరహాలో ఇప్పుడు తామూ ఆ ఆచారాన్ని పాటిస్తున్నామని అంటున్నారు. ఏటా అగ్‌హన్‌ మాసంలో ముళ్ల కంపపై రజ్జడ్‌ తెగ ప్రజలు దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషించి, తమ కోరికలు నెరవేరుస్తాడనేది వారి నమ్మకం. ముళ్లపై దొర్లిన అనంతరం తమ సోదరిని అత్తారింటికి సాగనంపుతూ వీడ్కోలు పలుకుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని