Delhi High Court: 150 ఏళ్ల తర్వాత న్యాయస్థానానికి వస్తారా

చట్టప్రకారం దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకు తాను వారసురాలినంటూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌ వేసిన సుల్తానా బేగమ్‌.. తాను మొగల్‌ చక్రవర్తి బహాదూర్‌ షా జఫర్‌-2 మునిమనవడి భార్యనని పేర్కొంది.

Updated : 21 Dec 2021 08:25 IST

 ఎర్రకోటకు వారసురాలినంటూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: చట్టప్రకారం దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకు తాను వారసురాలినంటూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌ వేసిన సుల్తానా బేగమ్‌.. తాను మొగల్‌ చక్రవర్తి బహాదూర్‌ షా జఫర్‌-2 మునిమనవడి భార్యనని పేర్కొంది. భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ బహాదూర్‌ షాను మయన్మార్‌ జైలుకు పంపించి, ఎర్రకోటను బలవంతంగా లాక్కుందని ఆమె పేర్కొన్నారు. ఈ వాదనను న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా పల్లి అంగీకరించలేదు. 1857 సంగ్రామం జరిగి 150 సంవత్సరాలు దాటిపోయిందని,  ఎందుకింత ఆలస్యంగా న్యాయస్థానానికి వచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎర్రకోట తమదేనంటూ బహాదూర్‌ షా అసలైన వారసులే ఎన్నడూ కేసులు వేయలేదని, మరలాంటప్పుడు మీకేం అధికారం ఉందని పిటిషనర్‌ను నిలదీశారు. తాను నిరక్ష్యరాస్యురాలినని, అందుకే ఇప్పటివరకు కేసు వేయలేదని సుల్తానా బేగమ్‌ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. ఎర్రకోటకు మీరు చట్టబద్ధ వారసురాలైతే అందుకు సంబంధించిన దస్తావేజులేమైనా ఉన్నాయా అని న్యాయమూర్తి అడిగారు. అందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎలాంటి దస్తావేజులు లేవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని