Covishield: 3 నెలలకే తరుగుతున్న..కొవిషీల్డ్‌ టీకా రక్షణ!

భారత్‌లో కొవిషీల్డ్‌గా పిలుస్తున్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా పనితీరుపై ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం సాగించారు. రెండు డోసులు తీసుకున్న 3 నెలల తర్వాత.. ఈ టీకా కారణంగా లభించే రక్షణ క్రమంగా క్షీణిస్తున్నట్టు గుర్తించారు.

Updated : 22 Dec 2021 09:35 IST

లండన్‌:  భారత్‌లో కొవిషీల్డ్‌గా పిలుస్తున్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా పనితీరుపై ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం సాగించారు. రెండు డోసులు తీసుకున్న 3 నెలల తర్వాత.. ఈ టీకా కారణంగా లభించే రక్షణ క్రమంగా క్షీణిస్తున్నట్టు గుర్తించారు. బూస్టర్‌ డోసు ద్వారా ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. పరిశోధకులు కేవలం ఒక్క ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తీసుకున్నవారినే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ వివరాలను ‘ద లాన్సెట్‌’ పత్రిక వెల్లడించింది. స్కాట్లాండ్‌, బ్రెజిల్‌కు చెందిన మొత్తం 4.4 కోట్ల మందిలో టీకా కారణంగా ఏర్పడిన యాంటీబాడీలస్థాయికి సంబంధించిన డేటాను విశ్లేషించినట్లు గ్లాస్గో వర్సిటీ ఆచార్యుడు కటికిరెడ్డి శ్రీనివాస విఠల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని