రూ.5 కోట్లు పలికిన గుర్రం.. అయినా అమ్మేందుకు నో!

మహారాష్ట్రలోని నందూర్బర్‌ జిల్లా సారంగ్‌ఖేడ్‌ అశ్వాల మార్కెట్‌ స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వేర్వేరు జాతుల గుర్రాలు ఇక్కడ అమ్మకానికి వస్తాయి. నాసిక్‌ నుంచి వచ్చిన రావణ్‌ అనే పేరున్న గుర్రానికి రూ.5 కోట్లు ఇచ్చి...

Updated : 24 Dec 2021 10:40 IST

నందూర్బర్‌: మహారాష్ట్రలోని నందూర్బర్‌ జిల్లా సారంగ్‌ఖేడ్‌ అశ్వాల మార్కెట్‌ స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వేర్వేరు జాతుల గుర్రాలు ఇక్కడ అమ్మకానికి వస్తాయి. నాసిక్‌ నుంచి వచ్చిన రావణ్‌ అనే పేరున్న గుర్రానికి రూ.5 కోట్లు ఇచ్చి కొనేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చినా అమ్మేందుకు దాని యజమాని అసద్‌ సయ్యద్‌ నిరాకరించారు. ఇంకా మంచిధర వస్తుందనే నమ్మకం దానికి కారణం. ఇది మార్వార్‌ జాతికి చెందిన అరుదైన గుర్రం. 68 అంగుళాల ఎత్తు ఉంది. రోజుకు పది లీటర్ల పాలు, కేజీ నెయ్యి, ఐదు గుడ్లు, చిరు ధాన్యాలు, తవుడు, ఎండు ఫలాలు తింటుంది. ఈసారి 4 రోజుల్లోనే 278 గుర్రాలు అమ్ముడుపోయాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని