ఖరీదైన చలిమంట.. చలి కాచుకునేందుకు ఓ దొంగ చేశాడంటే!

ప్రస్తుత శీతాకాలంలో చలి కారణంగా దేశప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా కొందరు.. కర్రలకు నిప్పంటించి చలి కాచుకుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ మాత్రం.. చలికాచుకునేందుకు చోరీ చేసిన

Updated : 26 Dec 2021 07:36 IST

 

ముంబయి: ప్రస్తుత శీతాకాలంలో చలి కారణంగా దేశప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా కొందరు.. కర్రలకు నిప్పంటించి చలి కాచుకుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ మాత్రం.. చలికాచుకునేందుకు చోరీ చేసిన ద్విచక్ర వాహనానికే నిప్పంటించాడు. నాగ్‌పుర్‌లోని యశోధరానగర్‌లో తమ వాహనాలు చోరీకి గురయ్యాయంటూ అనేక మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చోటా సర్ఫరాజ్‌తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ ముఠా 10 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు తేలింది. వాటిలో.. 9 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పదో వాహనం గురించి సర్ఫరాజ్‌ను ప్రశ్నించగా.. ‘‘బాగా చల్లగా ఉంటోంది. అందుకే చలి కాచుకునేందుకు ఆ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టాను’’ అని తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని