Suicide: మాదకద్రవ్యాల కేసు భయంతో యువనటి ఆత్మహత్య

మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ‘నకిలీ అధికారుల’ వేధింపులు తట్టుకోలేక ఓ యువనటి ఆత్మహత్యకు పాల్పడింది. ముంబయికి చెందిన ఆ నటి(28) తన స్నేహితులతో కలిసి డిసెంబరు 20న ఓ 5 నక్షత్రాల హోటల్‌లో పార్టీకి వెళ్లింది.

Published : 27 Dec 2021 07:21 IST

ముంబయి: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ‘నకిలీ అధికారుల’ వేధింపులు తట్టుకోలేక ఓ యువనటి ఆత్మహత్యకు పాల్పడింది. ముంబయికి చెందిన ఆ నటి(28) తన స్నేహితులతో కలిసి డిసెంబరు 20న ఓ 5 నక్షత్రాల హోటల్‌లో పార్టీకి వెళ్లింది. అక్కడకు వచ్చిన ఇద్దరు నకిలీ   ఎన్‌సీబీ అధికారులు.. మాదకద్రవ్యాల కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే.. రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆమెకు పదేపదే ఫోన్‌ చేసి డబ్బుల కోసం విసిగించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితులు సూరజ్‌ మోహన్‌ పర్దేశి(38), ప్రవీణ్‌ రఘునాథ్‌ వాలింబే(35)ను ఠాణెలో అరెస్టు చేశారు. మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్‌ మాలిక్‌ నటి ఆత్మహత్య నేపథ్యంలో ఎన్‌సీబీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్‌సీబీనే తమ ప్రైవేట్‌ సైన్యంతో డబ్బుల కోసం నటిని వేధించిందని, అందువల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు. ‘‘బాలీవుడ్‌ నటీమణుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఎన్‌సీబీనే ప్రైవేట్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. నకిలీ కేసుల పేరుతో వారిని బెదిరించి, డబ్బులను గుంజుతోంది’’ అని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని