Covaxin: 15-18 ఏళ్లవారికి కొవాగ్జిన్‌ టీకాయే

కరోనా దృష్ట్యా దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం దాని నిమిత్తం ప్రస్తుతానికి.. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌నే వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

Published : 27 Dec 2021 07:33 IST

ప్రస్తుతానికి ఒక్క రకమే

దిల్లీ: కరోనా దృష్ట్యా దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం దాని నిమిత్తం ప్రస్తుతానికి.. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌నే వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వయోవర్గం వారికి జనవరి 3 నుంచి టీకాలు వేయిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వయసున్న జనాభా దాదాపు ఏడెనిమిది కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ఆరోగ్య రంగ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వయసులో ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారికి మూడో డోసుగా వారు ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్‌నే వచ్చే నెల 10 నుంచి ఇవ్వనున్నారు. వాక్సిన్‌ అవసరమైన వారు తమ పేరు నమోదు చేసుకునేందుకు తగిన మార్పుల్ని కొవిన్‌ పోర్టల్‌లో చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని