Corona Vaccine: కొవిడ్‌ టీకా వద్దంటూ చెట్టెక్కాడు

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంటు వ్యాప్తి కలవరపెడుతున్నప్పటికీ.. కొవిడ్‌ వ్యాక్సిను తీసుకోడానికి వివిధ కారణాలతో ఇప్పటికీ చాలామంది వెనకడుగు వేస్తున్నారు. టీకా భయంతో చెట్టెక్కిన ఓ వ్యక్తి ఆరోగ్య కార్యకర్తలకు చుక్కలు చూపించిన సంఘటన

Updated : 30 Dec 2021 13:10 IST

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంటు వ్యాప్తి కలవరపెడుతున్నప్పటికీ.. కొవిడ్‌ వ్యాక్సిను తీసుకోడానికి వివిధ కారణాలతో ఇప్పటికీ చాలామంది వెనకడుగు వేస్తున్నారు. టీకా భయంతో చెట్టెక్కిన ఓ వ్యక్తి ఆరోగ్య కార్యకర్తలకు చుక్కలు చూపించిన సంఘటన పుదుచ్చేరిలో జరిగింది. స్థానిక కోనేరికుప్పం గ్రామవాసులకు టీకా వేసేందుకు ఆరోగ్య సిబ్బంది రాగా.. ‘నాకు టీకా వద్దంటే వద్దు’ అంటూ ముత్తువేల్‌ (39) అనే వ్యక్తి చెట్టెక్కి కూర్చున్నాడు. గతంలోనూ పలుమార్లు ఇతను ఆరోగ్య సిబ్బందిని తప్పించుకు తిరిగాడు. తాజాగా డోర్‌ టు డోర్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టిన ఆరోగ్య సిబ్బంది ‘బాబ్బాబూ! నీ మంచికే.. పుణ్యముంటుంది చెట్టు దిగు నాయనా!’ అని ఎంత బతిమాలినా ముత్తువేల్‌ ససేమిరా అన్నాడు. ఇంతకూ టీకా వద్దనేందుకు అసలు కారణమేంటో తెలుసా!.. టీకా తీసుకుంటే మద్యం తాగకూడదంటారనే భయంతోనే. ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని