Fake Currency:యూట్యూబ్‌ చూసి.. దొంగనోట్ల ముద్రణ

యూట్యూబ్‌ చూసి చాలామంది వంటలు, ఇతరత్రా పనులు నేర్చుకుంటారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ పుండలీక నగర్‌కు చెందిన ఇంజినీర్‌ సమ్రాన్‌(30) అలియాస్‌ లక్కీ నకిలీనోట్ల తయారీ నేర్చుకున్నాడు. ఓ గదిలో ముద్రణ యంత్రం ఏర్పాటు చేశాడు.

Updated : 31 Dec 2021 06:57 IST

దొంగనోట్లు, ముద్రణ యంత్రంతో పోలీసు అధికారులు

యూట్యూబ్‌ చూసి చాలామంది వంటలు, ఇతరత్రా పనులు నేర్చుకుంటారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ పుండలీక నగర్‌కు చెందిన ఇంజినీర్‌ సమ్రాన్‌(30) అలియాస్‌ లక్కీ నకిలీనోట్ల తయారీ నేర్చుకున్నాడు. ఓ గదిలో ముద్రణ యంత్రం ఏర్పాటు చేశాడు. దొంగనోట్లు తయారుచేసి చిన్నచిన్న దుకాణాల్లో, బెల్టుషాపుల్లో చలామణి ప్రారంభించాడు. ఓ వైన్‌షాపు యజమాని ఫిర్యాదుతో విషయం పోలీసులకు తెలిసింది. ఏఎస్‌ఐ శేష్‌రావ్‌ ఖటానే బృందం.. నిఘా పెట్టింది. దొంగనోట్ల చలామణి కేసులో అరెస్టయి బెయిలుపై బయటకువచ్చిన రంగనాథ్‌ వైన్‌షాపు వద్ద కనిపించగా.. ఆరా తీశారు. సమ్రాన్‌ గుట్టు బయటపడింది. కలర్‌ ప్రింటర్లు,   రూ.1,20,000 నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమ్రాన్‌తోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని