Metro Rail:మెట్రో మెట్లు.. పియానో సరాగాలు..

మెట్లు ఎక్కాలంటే మనలో చాలామంది అమ్మో అంటారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు వెదుకుతారు. కేరళలోని ఎర్నాకుళం ఎంజీ రోడ్‌ మెట్రోస్టేషనులో మాత్రం.. మళ్లీ మళ్లీ మెట్లే ఎక్కుతామంటున్నారు ప్రయాణికులు. కారణం..

Updated : 31 Dec 2021 07:46 IST

మెట్లు ఎక్కాలంటే మనలో చాలామంది అమ్మో అంటారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు వెదుకుతారు. కేరళలోని ఎర్నాకుళం ఎంజీ రోడ్‌ మెట్రోస్టేషనులో మాత్రం.. మళ్లీ మళ్లీ మెట్లే ఎక్కుతామంటున్నారు ప్రయాణికులు. కారణం.. ఆ  మెట్ల నుంచి వినిపిస్తున్న శ్రావ్యమైన సంగీతమే. ప్రజలను ఆరోగ్యకరమైన అలవాట్ల దిశగా నడిపించేందుకు కేరళలోని కొచ్చి మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (కేఎంఆర్‌ఎల్‌) అధికారులు వినూత్నంగా ఆలోచించి మెట్రోస్టేషనులో మ్యూజికల్‌ స్టెయిర్‌కేసు ఏర్పాటు చేశారు. ఈ మెట్లపై అడుగు పెడితే చాలు.. అందంగా లైట్లు వెలుగుతాయి. పియానో, కీబోర్డు నుంచి వచ్చే సంగీత ధ్వనులూ వినిపిస్తాయి. దీనివల్ల తాము ఒత్తిడిని మర్చిపోతున్నామని జనం చెబుతున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఈ సానుకూల స్పందనతో తాము ఇతర స్టేషన్లలోనూ ఈ తరహా మెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రయాక్సియా మేనేజింగ్‌ డైరెక్టరు సనోజ్‌ సిమోన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని