Piyush Jain: రూ.52 కోట్లు పన్నుగా తీసుకోండి..వ్యాపారి పీయూష్‌ జైన్‌ ప్రతిపాదన

భారీ స్థాయిలో పన్ను ఎగవేసి, రూ.కోట్లకొద్దీ నగదును ఇంట్లో దాచి దొరికిపోయిన ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌ జైన్‌ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. తాను పన్ను ఎగ్గొట్టిన మాట...

Updated : 31 Dec 2021 09:31 IST


 

దిల్లీ: భారీ స్థాయిలో పన్ను ఎగవేసి, రూ.కోట్లకొద్దీ నగదును ఇంట్లో దాచి దొరికిపోయిన ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌ జైన్‌ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. తాను పన్ను ఎగ్గొట్టిన మాట వాస్తవమేనని, అయితే తన నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.195 కోట్లలో అపరాధ రుసుముగా రూ.52 కోట్లను మినహాయించి మిగిలినది వెనక్కు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టాడు. ఈమేరకు ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.  

పీయూష్‌ నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును వ్యాపారం ద్వారా ఆర్జించిన ఆదాయంగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజన్స్‌ పరిగణిస్తోందని, అందులో నాలుగో వంతును పన్ను కింద మినహాయించి మిగిలినది తిరిగివ్వనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతోందని, అది పూర్తయ్యాకే చెల్లించాల్సిన పన్ను ఎంత అనేది నిర్ధారణ అవుతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని