
Water Metro:కేరళలో వాటర్ మెట్రో.. దేశంలో ప్రథమం
బ్యాటరీతో నడిచే కార్లు, బైకులు తెలుసు.. బోటును ఎప్పుడైనా చూశారా? కేరళకు వెళ్తే.. అక్కడి వాటర్ మెట్రో ప్రాజెక్టులో భాగమైన ఈ తరహా బోటును చూడొచ్చు. ‘దేవభూమి’ కేరళలో ఎటుచూసినా.. నీళ్లే. ఈ నేపథ్యంలో కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్‌ఎల్) ఓ వినూత్న ఆలోచనతో దేశంలోనే మొదటిసారిగా వాటర్ మెట్రో ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా.. బ్యాటరీతో నడిచే బోటును కేఎంఆర్‌ఎల్‌కు కొచ్చి షిప్‌యార్డు అప్పగించింది. వందమందితో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ బోటు 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగు అవుతుంది. గంటకు 10 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ వ్యవస్థతో ప్రయాణ సమయంలో ప్రకృతి అందాలను వీక్షించేలా దీన్ని రూపొందించారు. బోటు ఛార్జింగు అయిపోతే దానంతటదే డీజిల్ ఆప్షన్‌కు మారిపోతుంది. మరోమాట.. ప్రపంచంలోనే విద్యుత్తు బ్యాటరీతో నడిచే అతిపెద్ద బోటు కూడా ఇదే. మొత్తం 23 విద్యుత్ బోట్లు ఇపుడు కొచ్చి షిప్‌యార్డ్ రూపొందిస్తోంది. 76 కి.మీ.ల పొడవుతో, 38 టెర్మినళ్లను కలుపుతూ ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.