
Published : 02 Jan 2022 06:55 IST
Crime News:మేకలను దొంగలించిన పోలీసులు
కటక్, న్యూస్‌టుడే: కొత్త సంవత్సరం వేడుకల్లో విందు కోసమని పోలీసులు రెండు మేకలను దొంగలించారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకల మందలో రెండు కనిపించకపోవడంతో పోలీసులే దొంగిలించారని తెలుసుకొని.. స్టేషన్ వెనుక వాటిని కోసేందుకు చూస్తుండగా వెళ్లి అడ్డుకున్నారు. అయినా.. పోలీసులు వినలేదు. దీంతో సంకీర్తనగురు గ్రామస్థులకు విషయం చెప్పి, ఫిర్యాదు చేసేందుకు మళ్లీ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు సంకీర్తనగురును బెదిరించారు. విషయం ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఏఎస్‌ఐ సుమన్ మల్లిక్‌ను శనివారం సస్పెండు చేశారు.
Tags :