Bipin Rawat:రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణం!

భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది దుర్మరణం పాలైన హెలికాప్టర్‌ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో

Updated : 03 Jan 2022 06:59 IST

కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వయిరీలో నిర్ధారణ?

దిల్లీ: భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది దుర్మరణం పాలైన హెలికాప్టర్‌ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆఫ్‌ ఎంక్వయిరీ’లో నిర్ధారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను త్వరలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరికి సమర్పించనున్నారు. ప్రస్తుతం తుది నివేదికను వైమానిక దళం న్యాయవిభాగం పరిశీలిస్తోంది. నివేదికలోని అంశాలపై అటు ప్రభుత్వం గానీ.. ఇటు వైమానిక దళం గానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే గత నెల 8న తమిళనాడులోని కూనూర్‌కి సమీపంలో రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ అనుకోకుండా ప్రతికూల వాతావరణంలోకి వెళ్లి చిక్కుకుపోయిందని, అంతే తప్ప అందులో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక తప్పిదాలు దొర్లలేదని నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని