Vaccine: 11సార్లు కరోనా టీకా వేసుకున్నానోచ్‌!

ఇప్పటివరకు దేశంలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు కరోనా టీకా తీసుకుని ఉంటారు? మొదటి, డోసు రెండో డోసు కలిపితే గరిష్ఠంగా రెండు సార్లు. అలాంటిది తాను 11 సార్లు టీకా తీసుకున్నట్లు ప్రకటించి బిహార్‌లోని మాధేపుర

Updated : 05 Jan 2022 09:33 IST

మాధేపుర: ఇప్పటివరకు దేశంలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు కరోనా టీకా తీసుకుని ఉంటారు? మొదటి, డోసు రెండో డోసు కలిపితే గరిష్ఠంగా రెండు సార్లు. అలాంటిది తాను 11 సార్లు టీకా తీసుకున్నట్లు ప్రకటించి బిహార్‌లోని మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్‌ మండల్‌ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే అన్నిసార్లు వేసుకున్నానని చెప్పారు. జిల్లాలోని ఉదకిషన్‌గంజ్‌ సబ్‌ డివిజన్‌ ఒరాయ్‌ గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్‌.. 12వ డోసు తీసుకునేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లానని తెలిపారు. అయితే అక్కడ టీకాల కార్యక్రమం ముగియడంతో 12వ డోసు పొందలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. పోస్టల్‌ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన తొలి డోసు 13 ఫిబ్రవరి, 2021న తీసుకున్నారు. అప్పటి నుంచి డిసెంబరు, 2021 వరకు 11 డోసులు పొందారు. ఏయే తేదీల్లో టీకా తీసుకున్నదీ ఆయన రాసి పెట్టుకోవడం విశేషం. ఈ సంగతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని