Vaccine: గర్భిణులకు కొవిడ్‌ టీకా సురక్షితమే

కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించే టీకాల వల్ల గర్భిణులకు ముందస్తు కాన్పులకు సంబంధించిన సమస్యలేవీ తలెత్తవని, శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తారనే భయాందోళనలూ అవసరం లేదని

Updated : 06 Jan 2022 14:37 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించే టీకాల వల్ల గర్భిణులకు ముందస్తు కాన్పులకు సంబంధించిన సమస్యలేవీ తలెత్తవని, శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తారనే భయాందోళనలూ అవసరం లేదని ఓ అధ్యయన నివేదిక తేల్చి చెప్పింది. గర్భిణులు టీకా తీసుకోవడం ద్వారా కరోనా వల్ల వచ్చే మరణ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని యేల్‌ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హీతర్‌ లిప్‌కిండ్‌ స్పష్టం చేశారు. 16 నుంచి 49 ఏళ్ల వయసులోపు గర్భిణులు 40వేల మందిపై చేసిన అధ్యయన వివరాలను అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) మంగళవారం వెలువరించింది. టీకాలు తీసుకోని, తీసుకున్న గర్భిణులను పరిశీలించిన తర్వాత...కడుపులో పిండస్థ శిశువుకు వ్యాక్సిన్‌ వల్ల ఎటువంటి హానీ కలగదనే నిర్ధారణకు వచ్చారు. ఎనిమిది ఆరోగ్య సంరక్షణ సంస్థల నుంచి  సమాచారాన్ని సేకరించారు. 96 శాతం మంది గర్భిణులకు ఫైజర్‌ లేదా మోడెర్నా అభివృద్ధిపరిచిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలనే ఇచ్చారు. కొవిడ్‌ టీకాల వల్ల కడుపులోని శిశువుకు సమస్యలు ఎదురుకావచ్చన్నది అపోహ మాత్రమేనని తేలిపోయిందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని