Booster Dose: ఒక్క బూస్టర్‌తో అన్ని వేరియంట్లకు చెక్‌

కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేయగల టీకా ఒకటి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్‌ డోసుగా తీసుకునేందుకు వీలుగా దాన్ని తయారు చేస్తున్నారు.

Updated : 06 Jan 2022 14:35 IST

లండన్‌: కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేయగల టీకా ఒకటి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్‌ డోసుగా తీసుకునేందుకు వీలుగా దాన్ని తయారు చేస్తున్నారు. ‘సామ్‌ఆర్‌ఎన్‌ఏ’ వ్యాక్సిన్‌గా పిలుస్తున్న ఈ వైరస్‌.. అన్ని కరోనా వేరియంట్లపై రోగ నిరోధక వ్యవస్థను వేగంగా అప్రమత్తం చేసి, అధిక స్థాయుల్లో యాంటీబాడీలను ఉత్పత్తి చేయగలుగుతున్నట్లు అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ ‘గ్రిస్టోన్‌ బయో’ నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమోదం పొందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలతో పోలిస్తే.. 10వ వంతు డోసుతోనే ఈ వ్యాక్సిన్‌ అధిక స్థాయుల్లో యాంటీబాడీలను తయారుచేయిస్తుండటం మరో విశేషం. శరీరంలో రెండో రక్షణ వ్యవస్థగా పరిగణించే టి-సెల్‌ వ్యవస్థనూ తాజా బూస్టర్‌ టీకా ప్రేరేపిస్తోందని పరిశోధకులు తెలిపారు. విలక్షణమైన ‘సీడీ8ప్లస్‌’ టి-సెల్‌ ప్రతిస్పందనలను అది ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలవడం, ఆసుపత్రుల్లో చేరడం, మరణించడం వంటి ముప్పులను తగ్గించేందుకు అవి దోహదపడతాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని