సినీఫక్కీలో మాజీ మంత్రిని వెంటాడి పట్టుకున్నారు

తమిళనాడు మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీని పోలీసులు సినీ ఫక్కీలో కర్ణాటకలో అరెస్టు చేశారు. ఉద్యోగాలిప్పిస్తానంటూ అనేకమంది నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలను తీసుకుని

Published : 06 Jan 2022 07:14 IST

హాసన, న్యూస్‌టుడే: తమిళనాడు మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీని పోలీసులు సినీ ఫక్కీలో కర్ణాటకలో అరెస్టు చేశారు. ఉద్యోగాలిప్పిస్తానంటూ అనేకమంది నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలను తీసుకుని మోసగించారనేది రాజేంద్ర బాలాజీపై ఉన్న అభియోగం. ఈ నేపథ్యంలో ఆయన కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. కర్ణాటకలోని హాసన పట్టణంలో రాజేంద్ర తలదాచుకున్నట్లు నిర్ధారించుకున్న తమిళనాడు పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారశాఖ కార్యాలయం ఎదురుగా బుధవారం ఉదయం కారులో వెళ్తున్న విషయాన్ని గుర్తించి ఆ వాహనాన్ని వెంటాడారు. సిగ్నల్‌వద్ద కారు ఆగడంతో రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని